: కోహ్లీ విశ్వరూపం... డబుల్ సెంచరీతో వీరవిహారం


హైదరాబాదులో బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 239 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 203 పరుగులు సాధించాడు. ఎక్స్ ట్రా కవర్ మీద బౌండరీ సాధించడం ద్వారా కోహ్లీ ద్విశతకం సాధించాడు. ఈ క్రమంలో మొత్తం 24 ఫోర్లను బాదాడు కోహ్లీ. మరోవైపు, 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 493 పరుగులు. మరో ఎండ్ లో సాహా 8 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 2, మెహెది హసన్, టస్కిన్ అహ్మద్ లు చెరో వికెట్ తీశారు. భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 

  • Loading...

More Telugu News