: ఇందిరాగాంధీపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు
దివంగత ప్రధాని ఇందిరాగాంధీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. భారత ప్రధానిగా ఆమె పోషించిన పాత్ర అసామాన్యమైనదని కొనియాడారు. జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సు అమరావతిలో జరగడం చాలా ఆనందంగా ఉందని... దీనికి స్పీకర్ కోడెలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఎందరో మహిళలు పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా విధులను సమర్థవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మహిళా సాధికారత అనేది అసాధ్యమైన అంశం కాదని... మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. ప్రతి మహిళ కలలు కనాలని... వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించాలని సూచించారు. తమ కుటుంబ వ్యాపారాలను తన భార్య, తన కోడలు చూసుకుంటున్నారని చెప్పారు. మహిళా సాధికారతకు ఇది ఒక నిదర్శనమని తెలిపారు.