: విరుచుకుపడుతున్న కోహ్లీ, రహానే.. భారీ స్కోరు దిశగా టీమిండియా
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే విరుచుకుపడుతున్నారు. వీరిద్దరి బ్యాటింగ్ కు బంగ్లా బౌలర్లు కుదేలైపోతున్నారు. మూడు వికెట్ల నష్టానికి 356 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. విరాట్ కోహ్లీ 174 పరుగులతో, రహానే 82 పరుగులతో ఆడుతున్నారు. వీరిద్దరూ కలసి ఇప్పటికే 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 456 పరుగులు.