: మరోసారి మణప్పురం ఫైనాన్స్ లో భారీ దోపిడీ... దొంగలకు టార్గెట్ గా మారిన ఫైనాన్స్ సంస్థ


బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే సంస్థ మణప్పురం ఫైనాన్స్ దోపిడీ దొంగలకు లక్ష్యంగా మారింది. మరోసారి ఈ సంస్థకు చెందిన కార్యాలయంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ లో మణప్పురం సంస్థ కార్యాలయంలో గురువారం దొంగలు పట్టపగలే చొరబడి రూ.9 కోట్ల విలువ జేసే 32 కిలోల తాకట్టు బంగారు ఆభరణాలతో పరారయ్యారు. ఎనిమిది మంది ఆయుధాలతో న్యూ రైల్వే రోడ్డు శాఖలోకి చొరబడి వాల్ట్ లలో ఉన్న 32 కిలోల బంగారు ఆభరణాలతోపాటు రూ.7.8లక్షల నగదును సైతం దోచుకున్నారు.

తొలుత దొంగలు ద్వారం వద్ద ఉన్న కాపలాదారుడిపై పదునైన ఆయుధంతో దాడికి  పాల్పడి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మరో కాపలాదారుడి చేతిలోని ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆధారాలు లేకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. మణప్పురం ఫైనాన్స్ కేరళలోని త్రిస్సూర్ జిల్లా వాలప్పాడ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 3,200 కార్యాలయాలు ఉన్నాయి. గతేడాది కోల్ కతా, థానే, నాగ్ పూర్, జలంధర్ లోని మణప్పురం సంస్థ కార్యాలయాల్లో దొంగలు భారీ దోపిడీలకు పాల్పడ్డారు. ఈ ఏడాది జనవరి 5న ఛత్తీస్ గఢ్ లోని ఓ శాఖలోనూ విలువైన సొత్తును దోచుకున్నారు.

  • Loading...

More Telugu News