: ట్రంప్‌కు షాకిచ్చిన మరో కోర్టు.. ట్రావెల్ బ్యాన్ అమలుకు నిరాకరణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన ట్రావెల్‌బ్యాన్‌ను అమలు చేసేందుకు మరో కోర్టు నిరాకరించింది. ప్రయాణ నిషేధ ఉత్తర్వుల అమలు సాధ్యం కాదంటూ అప్పీల్ కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు తీర్పు ట్రంప్‌కు చెంపపెట్టు అని వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా కోర్టు తీర్పులపై ట్రంప్ మండిపడుతున్నారు. దేశభద్రతను కోర్టులు పణంగా పెడుతున్నాయని విమర్శిస్తున్నారు. అప్పీల్ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తానంటూ ట్రంప్ పేర్కొన్నారు.