: తాగి నడిపి ప్రాణాలు తీస్తే ఇక హత్య కిందే లెక్క.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం


తాగి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాగి వాహనం నడిపి వ్యక్తుల ప్రాణాలు తీసేవారిపై ఇక నుంచి హత్యానేరం మోపి శిక్షించాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రస్తుత చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇకపై తాగి వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు తీస్తే హత్యగా పరిగణించాలని మోటారు వాహనాల బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి కారణమైన వారిపై 304 సెక్షన్ కింద  శిక్షార్హమైన హత్యకు పాల్పడేవారికి యావజ్జీవ జైలు శిక్ష లేదంటే పదేళ్ల కఠిన కారాగారం, లేదంటే జరిమానా విధించాలని కమిటీ సిఫారసు చేసింది.

తాగి నడిపి ప్రమాదానికి పాల్పడితే ముందస్తు పథకంగానే భావించి శిక్ష విధించాలని  సూచించింది. నిందితులు వాహనం నడిపినప్పుడు తాగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు అంతర్జాతీయ పరీక్ష పరికరాలు వాడాలని సూచించింది. అలాగే బైక్, కార్ల రేసింగ్‌లపైనా కొరడా ఝళిపించాలని సిఫారుసు చేసింది. రేసింగ్‌లకు పాల్పడే వ్యక్తులపై విధిస్తున్న జరిమానా మొత్తాన్ని పెంచాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

  • Loading...

More Telugu News