: యూట్యూబ్‌లోనూ మొబైల్ లైవ్ స్ట్రీమింగ్.. పదివేల మంది ఫాలోవర్లు ఉంటేనే సుమా!


యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వారికి శుభవార్త. ఫేస్‌బుక్, ట్విట్టర్ మాదిరిగానే యూట్యూబ్‌లోనూ మొబైల్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. పదివేల మంది ఫాలోవర్లు ఉన్నవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంస్థ అధికారులు పేర్కొన్నారు. యూట్యూబ్ మొబైల్  యాప్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. మామూలుగా అప్‌లోడ్ చేసే వీడియోకు ఉన్నట్టే దీనికి కూడా ఆప్షన్లు ఉంటాయని వారు పేర్కొన్నారు. అంతేకాక ‘మానిటైజేషన్’ టూల్ ‘సూపర్ చాట్’ ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని సదరు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News