: కడప నేత ఒకరు టీడీపీలో చేరనున్నారు: మంత్రి గంటా


కడప నుంచి బలమైన నేత ఒకరు టీడీపీలో చేరనున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమలో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, కడపకు పూర్వవైభవం వస్తుందని అన్నారు. అయితే, టీడీపీలోకి వస్తున్న ఆ నేత ఎవరు, ఏ పార్టీ నుంచి అనే వివరాలను ఆయన ప్రస్తావించలేదు. కాగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ ఛార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీ కి గుడ్ బై చెబుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ సొంత జిల్లా నుంచి ఒక నేత టీడీపీలోకి వస్తున్నారంటూ గంటా చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News