: అమెరికాలో మంచు తుపాన్.. స్తంభించిన జనజీవనం!
అమెరికాలో మంచు తుపాన్ ముంచుకు రావడంతో జనజీవనం అతలాకుతలమైంది. న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, బోస్టన్ లో మంచు తుపాన్ కారణంగా 8 నుంచి 10 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. దీంతో, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.