: సీఎంగా అవకాశమివ్వకపోతే రాష్ట్రపతి వద్దకు వెళతానన్న శశికళ!


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఈ రోజు గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అనంతరం, మీడియాతో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీంతో, ఆ భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిన్నమ్మ నోరు మెదపకపోయినా, ఆమె శిబిరంలోని నేతలు మాత్రం కొంత సమాచారం బయటపెట్టారు. తనకు మద్దతుగా ఉన్న 130 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారట.

మరో విషయమేమిటంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసే నిమిత్తం తనకు అవకాశమివ్వకపోతే, మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందు ప్రవేశపెట్టేందుకు తాను సిద్ధమని గవర్నర్ తో చెప్పారట. కాగా, శశికళ తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంతకాలు చేసిన పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు. ఈ సంతకాలన్నీ ఫోర్జరీ చేసినవే అని పన్నీర్ సెల్వం వర్గీయుడు మైత్రేయన్ ఆరోపించడం విదితమే.

  • Loading...

More Telugu News