: గ్రూప్-1 ఇంటర్వ్యూలను రద్దు చేసిన ఏపీపీఎస్సీ !
ఈ నెల 13 నుంచి జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారులు ఒక ప్రకటన చేశారు. వెరిఫికేషన్ సమయంలో లోపాల కారణంగా ఈ ఇంటర్వ్యూలను రద్దు చేశామని తెలిపింది. తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని, ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు.