: మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న శశికళ?


కొంచెం సేపటి క్రితం  రాజ్ భవన్ లో తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండా సైలెంట్ గా ఆమె వెళ్లిపోయారు. అయితే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేక మరేదైనా విషయం చెప్పారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, మరి కాసేపట్లో పొయెస్ గార్డెన్ లో సీనియర్ నేతలతో శశికళ సమావేశం కానున్నారని, మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అయితే, ఆమె వర్గం వారు, అభిమానులు మాత్రం చిన్నమ్మ సీఎం అయి తీరతారని చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News