: శశికళ నిందితురాలిగా ఉన్న అక్రమాస్తుల కేసు..వచ్చే వారంలో తీర్పు?


జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, శుక్రవారం లిస్టింగ్ లో ఈ కేసు నమోదు కాలేదు. దీంతో, ఈ కేసుపై తీర్పు వచ్చే వారంలో వెలువడే అవకాశముందని తెలుస్తోంది.

కాగా, అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చడం, ఈ తీర్పును సవాల్  చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేయడం విదితమే. అయితే, ఈ కేసును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ, కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో జయలలిత మృతి చెందారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ సీఎం పదవికి పోటీ పడుతుండటంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది.

  • Loading...

More Telugu News