: గవర్నర్ తో ముగిసిన శశికళ భేటీ.. మీడియాతో మాట్లాడకుండానే టెన్షన్ గా వెళ్లిపోయిన చిన్నమ్మ!


త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తోన్న నేతల్లో 10 మంది సీనియర్ నేత‌ల‌తో క‌లిసి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ భేటీ అయిన విష‌యం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్‌తో ఆమె భేటీ ముగిసింది. ఎమ్మెల్యేల సంత‌కాల‌తో కూడిన మ‌ద్ద‌తు లేఖ‌ను ఆమె గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించారు. గ‌వ‌ర్న‌ర్‌తో ఆమె భేటీ 20 నిమిషాల పాటు కొన‌సాగింది. ప్ర‌భుత్వం ఏర్పాటుకు అనుమతించాలని శ‌శిక‌ళ విజ్ఞ‌ప్తి చేశారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వారి జాబితాను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. అయితే, భేటీ ముగిసిన త‌ర్వాత ఆమె మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు. ఆమెలో ఓ నిరాశ‌, టెన్ష‌న్‌ క‌నిపించాయి.

ఈ రోజు గవర్నర్ ను కలిసిన అనంతరం పన్నీర్ సెల్వంలో ఓ సంతోషం, విజయం సాధించానన్న గర్వం కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు శశికళ ముఖంలో ఎటువంటి సంతోషం కనిపించకపోగా నిరాశ కనిపించడం గమనార్హం.

  • Loading...

More Telugu News