: సామాజిక మాధ్య‌మాల్లో ఆ వీడియోను పోస్ట్ చేసిన జవాన్ జాడ కనిపించడం లేదట!


తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు త‌మ ప‌ట్ల‌ అధికారుల తీరును దేశ ప్ర‌జ‌లంద‌రికీ తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అతని భార్య ష‌ర్మిల ఇటీవ‌లే మీడియా ముందుకు వ‌చ్చి తన భర్తను అధికారులు అరెస్ట్ చేసి వేధిస్తున్నారని పేర్కొన‌డంతో అధికారులు ఆమె ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

అయితే, ష‌ర్మ‌ల ఈ రోజు మ‌రోసారి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న భ‌ర్త ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న జాడ క‌నిపించ‌డం లేద‌ని ఆమె పేర్కొంది. త‌న భ‌ర్త‌తో కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడేందుకు అధికారులు ఒప్పుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీంతో ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో్ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కెకె.శర్మకు న్యాయస్థానం లీగల్‌ నోటీసులు పంపించనుంది.
 
స‌ద‌రు జ‌వాను సోదరుడు విజయ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాము బీఎస్‌ఎఫ్‌ అధికారులకు రెండు లేఖలు రాశామని తెలిపాడు. పలుసార్లు ఫోన్లు చేసినా ఎటువంటి స్పందనా రావడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప‌లుసార్లు ఫోన్‌ హోల్డ్‌లో పెట్టేస్తున్నారని, మరికొన్ని సార్లు లిఫ్ట్‌ చేసి పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించాడు.

  • Loading...

More Telugu News