: రాజ్‌భవన్ వద్ద గందరగోళం.. భారీగా తరలివచ్చి నినాదాలతో హోరెత్తిస్తోన్న శశికళ మద్దతుదారులు
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ పలువురు సీనియర్ నేతలతో కలిసి ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. అయితే, మరోవైపు రాజ్‌భవన్ బయట గందరగోళం నెలకొంది. అక్కడికి భారీగా తరలివచ్చిన అన్నాడీఎంకే కార్యకర్తలు శశికళకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. శశికళపై పోరాడుతున్న పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శశికళకు మద్దతుగా ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాజ్ భవన్ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.