: జయలలిత సమాధి వద్ద కన్నీటి పర్యంతమైన శశికళ
పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరి మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత సమాధిని దర్శించుకున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ అనంతరం అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరారు. అయితే, ఆమె అంతకు ముందు జయలలిత సమాధి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచిన ఆమె అనంతరం తాను గవర్నర్‌కు సమర్పించనున్న లేఖలను కూడా ఆమె సమాధిపై ఉంచి కన్నీరు పెట్టుకున్నారు. మరికాసేపట్లో ఆమె రాజ్‌భవన్ చేరుకోనున్నారు.