: జయలలిత సమాధి వద్దకు చేరుకున్న శశికళ నటరాజన్
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ చెన్నైలోని పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరి జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. ఆమె వెంట పలువురు మంత్రులు, పార్టీ నేతలు ఉన్నారు. జయలలిత సమాధికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ఆమె రాజ్‌భవన్‌కు వెళతారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆమె ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుకి ఇవ్వనున్నారు. గవర్నర్‌తో ఆమె 10 మంది మంత్రులతో కలిసి చర్చించనున్నారు. మెరీనా తీరంలో ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు వచ్చారు.