: శశికళ క్యాంప్ లో కలకలం.. బయటకు వెళ్లిపోతామంటున్న 12 మంది ఎమ్మెల్యేలు!
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు జారుకోకుండా ఉండేందుకు సుమారు 130 మంది సభ్యులను శశికళ నటరాజన్ పలు ప్రాంతాలకు తరలించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఎమ్మెల్యేల బృందంలోని 12 మంది సభ్యులు తాము బయటికి వెళతామని కోరినా, తమను పంపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెల్‌ఫోన్లు కూడా తమ దగ్గర లేకుండా చేశారని వారు మండిపడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వారు భోజనం కూడా చేయకుండా నిరసన తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో శశికళ ఆత్మరక్షణలో పడ్డారు. శశికళ వర్గం ఎమ్మెల్యేలందరినీ 8 బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంచినట్లు తెలుస్తోంది.