: జయలలిత సమాధి వద్దకు బయలుదేరిన శశికళ నటరాజన్
తమిళనాడు అధికార అన్నాడీంకే పార్టీలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్‌ను పన్నీర్ సెల్వం కలిసిన విషయం తెలిసిందే. అనంతరం అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ అక్కడకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఉన్న శశికళ జయలలిత సమాధివద్దకు బయలుదేరారు. జయలలిత సమాధికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె అక్కడి నుంచే రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఈ రోజు పోయెస్ గార్డెన్‌లో తమ పార్టీ సీనియర్ నేతలతో కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె విద్యాసాగర్ రావుకి వివరించనున్నారు.