: పోయెస్ గార్డెన్ లో ఎమ్మెల్యేలతో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారట!


తమిళనాడు రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కె. మాణిక్యం ఈ రోజు మీడియాకు చెప్పిన విషయమే. గత ఆదివారం నాడు పొయెస్ గార్డెన్ లో జరిగిన సమావేశంలో తెల్ల కాగితాలపై ఎమ్మెల్యేల సంతకాలు చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వెంట ఉన్న ఆయన .. ఆ నాటి సమావేశం గురించి ప్రస్తావించారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై చర్చించే నిమిత్తం సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ అక్కడికి వెళ్లామన్నారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా, పన్నీర్ సెల్వం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో తాము ఆశ్చర్యపోయామని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో నాలుగు తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News