: ఎప్పుడూ ధర్మమే గెలుస్తుంది.. మంచి శుభవార్త వింటాం!: నవ్వుతూ ప్రకటించిన పన్నీర్ సెల్వం
చెన్నైలోని రాజ్‌భవన్‌లో తమిళనాడు ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చర్చించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం అక్కడి నుంచి తన నివాసం వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ముఖంలో ఓ కళ కనిపించింది. విజయ గర్వంతో మాట్లాడినట్లు కనిపించారు. తన రాజీనామా వెనక్కు తీసుకుంటానని గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే అందరం ఓ మంచి శుభవార్త వింటామని చెప్పారు. ఎల్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని, తాము ధర్మం వైపు ఉన్నామని చెప్పారు. తనకు మద్దతు ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.