: తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించిన పన్నీర్ సెల్వం

తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైలోని రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో చర్చించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌కు పలు అంశాలు వివరించారు. శశికళ చేసిన ఒత్తిడి వల్లే తాను రాజీనామా చేశానని విద్యాసాగర్ రావుతో చెప్పారు. తన రాజీనామాకు దారితీసిన అన్ని పరిస్థితుల గురించి ఆయన సమగ్రంగా వివరించారు. పార్టీలో తన బలాన్ని ఎలా నిరూపించుకుంటారో కూడా చెప్పారు. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. అలాగే, మరికాసేపట్లో విద్యాసాగర్ రావును శశికళ కలవనున్నారు.