: 68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మురళి, పుజారా


హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో మురళీ విజయ్, చటేశ్వర్ పుజారాలు అరుదైన రికార్డును సాధించారు. భారత గడ్డపై ఒక సీజన్లో అత్యధిక సెంచరీలు సాధించిన జోడీగా అరుదైన ఫీట్ ను సాధించారు. ఈ క్రమంలో 68 ఏళ్లనాటి రికార్డును బద్దలు కొట్టారు.

1948-49 సీజన్లో భారత బ్యాట్స్ మెన్ విజయ్ హజారే, రూసీ మోదీలు నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. ప్రస్తుత ఉప్పల్ మ్యాచ్ తొలి రోజున మురళీ విజయ్ (108), చటేశ్వర్ పుజారా (83)లు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ సీజన్లో (2016-17) వీరిద్దరూ ఐదు సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పారు. దీంతో, 68 ఏళ్ల రికార్డు కనుమరుగు అయింది. 

  • Loading...

More Telugu News