: ఇలాగైతే శ్రీలంకలో మాత్రమే ఆడుకోవాల్సి ఉంటుంది: జయసూర్య వార్నింగ్
దక్షిణాఫ్రికా పర్యటనలో తమ జట్టు ఘోర వైఫల్యం చెందడం పట్ల శ్రీలంక చీఫ్ సెలెక్టర్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ గడ్డమీద గెలవడం మరిచిపోతే... కేవలం శ్రీలంకలో మాత్రమే ఆడుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. టెస్టుల్లో క్లీన్ స్వీప్ కావడం, ఐదు వన్డేల సిరీస్ ను ఇప్పటికే 4-0 తో కోల్పోవడంతో జయసూర్య అసహనం వ్యక్తం చేశాడు. ఉప ఖండంలోని స్పిన్ పిచ్ లకు ఆటగాళ్లు ఎక్కువగా అలవాటు పడ్డారని... ఈ కారణంగానే దక్షిణాఫ్రికా పిచ్ లకు అలవాటు పడటానికి తమ ఆటగాళ్లు ఎక్కువ సమయం తీసుకున్నారని తెలిపాడు. అయితే, ఈ ఓటమికి, దేశీయ క్రికెట్ కు ముడిపెట్టకూడదని చెప్పాడు.