: భర్త పీడ విరగడైందన్న సంతోషంలో 'విడాకుల కేక్' కట్ చేసిన మహిళ!
ఓ పాకిస్థానీ మహిళ పట్టలేని ఆనందంతో విచిత్రంగా ప్రవర్తించింది. తనను పీడిస్తోన్న భర్తకు విడాకులు ఇచ్చిన సంతోషంలో విడాకుల కేక్ కోసింది. ఈ సందర్భంగా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తన నుంచి పరారైన బాధ గురించి తెలిపింది. బర్త్ డే కేకులా ఆ మహిళ విడాకుల కేక్ కోయడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో విడాకులు అంటేనే తమ జీవితం ఏమైపోతుందోనని భయపడే మహిళలు ఉన్న ఆ దేశంలో విడాకులు వచ్చినందుకు గానూ సంబరాలు జరుపుకున్న ఆ మహిళను చూసి నివ్వెరపోతున్నారు. ఆ మహిళ పేరు మహమ్ ఆసిఫ్.. తన భర్త పెడుతున్న టార్చర్ భరించలేకే ఇటీవల ఆమె విడాకులు తీసుకుంది.