: తమిళనాడు సీఎంగా ఎవ‌రు ఉండాలో గ‌ట్టిగా చెప్పండి: ప్రజలకు నటుడు అరవింద్ స్వామి పిలుపు


త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ ఉత్కంఠ ప‌రిస్థితులు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ తీసుకునే నిర్ణ‌యంతో ముగుస్తాయ‌న్న నేప‌థ్యంలో ఈ అంశంపై ప్రముఖ నటుడు అరవింద్ స్వామి స్పందించాడు. రాష్ట్ర ప్రజలే త‌మ‌ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసుకోవాలని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. ప్ర‌జ‌లు త‌మ‌ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో వారి అభిప్రాయాన్ని గ‌ట్టిగా చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల నిర్ణ‌యాన్ని ఎవ‌రూ జడ్జ్ చేయలేరని ఆయ‌న అన్నారు. అన్ని నియోజకవర్గాల ప్ర‌జ‌లు త‌మ త‌మ ఎమ్మెల్యేల‌కు త‌మ నిర్ణ‌యాన్ని గురించి చెప్పాల‌ని ఆయ‌న అన్నారు.



  • Loading...

More Telugu News