: మాకేం సంబంధం లేదు: తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్
అన్నాడీఎంకేలో వచ్చిన విభేదాల కారణంగా ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభం విషయంలో కేంద్ర హోం శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్, తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధ్య పోరు నడవడం అన్నాడీఎంకే అంతర్గత విషయమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం గవర్నరే నిర్ణయాలు తీసుకుంటారని ఆయన చెప్పారు. మరోవైపు తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ చెన్నై విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ కు చేరుకున్నారు.