: 50 శాతం మార్కులు వచ్చిన వారికీ గురుకులాల్లో ఉద్యోగావకాశాలు: కేసీఆర్ ఆదేశాలు
గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను తొలగించాలంటూ కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను తొలగించి, 50 శాతం మార్కులు వచ్చిన వారికీ గురుకులాల్లో టీచర్ పోస్టులకు అవకాశం కల్పించాలని, మూడేళ్ల బోధనా అనుభవం ఉండాలనే నిబంధనను కూడా తొలగిస్తూ కేసీఆర్ ఆదేశించారు. గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సొసైటీ రూపొందించిన నిబంధనలను సడలించాలని అన్నారు. ఎన్ సీబీఏ మార్గదర్శకాలు, కోర్టుల తీర్పులను అనుసరించి, తెలుగు మీడియంలో పరీక్ష రాసే అవకాశం లేనందున, ఇంగ్లీషు మీడియంలోనే ప్రవేశ రాయాలని అభ్యర్థులకు సూచించారు.