: పోయెస్ గార్డెన్ లో శశికళ కీలక భేటీ
ఈ రోజు రాత్రి 7 గంటలకు తమిళనాడు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ పార్టీ సీనియర్ నేతలతో చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో తాము తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చిస్తున్నారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు మరికాసేపట్లో చెన్నై ఎయిర్‌పోర్టుకి చేరుకోనున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం వేర్వేరుగా పన్నీర్ సెల్వం, శశికళతో భేటీ అయిన అనంతరం ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గవర్నర్ న్యాయసలహాను తీసుకున్నారు. వాటికి అనుగుణంగా ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.