: పన్నీర్ సెల్వం వర్గంలో ఉత్సాహం.. శశికళ వర్గంలో కలవరం!
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్నటివరకు పూర్తి బలం తనకే ఉన్నట్లు కనిపించిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ వర్గంలో ఈ రోజు కలవరపాటు మొదలైంది. శశికళ వర్గం నుంచి జారుకున్న సీనియర్ నేత మధుసూదన్ మరో 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి పన్నీర్ సెల్వం గూటికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పన్నీరు సెల్వం బలం క్రమక్రమంగా పెరుగుతూ వెళుతోంది. బలప్రదర్శన సమయంలో తన సత్తా ఏంటో తెలుస్తుందని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుండడంతో పన్నీర్ సెల్వం క్యాంపులో ఉత్సాహం పెరిగిపోతోంది. తమవైపు నుంచి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతారోనని శశికళకు కంగారు మొదలైంది.