: ఢిల్లీకి పయనమైన అన్నాడీఎంకే ఎంపీలు


అన్నాడీఎంకే ఎంపీలు చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సాయంత్రం 6 గంటలకు వారు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వారు రాష్ట్రపతికి వివరించనున్నారు. మరోవైపు, కాసేపట్లో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విమానాశ్రయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ ను మొదట కలిసే అవకాశం పన్నీర్ కు దక్కనుంది. సాయంత్రం 5 గంటలకు శశికళ తన వర్గంతో కలసి గవర్నర్ తో సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News