: ఆ బాధతోనే మన్మోహన్ సింగ్ పేరు ఎత్తాను: నరేంద్ర మోదీ


మన్మోహన్ రెయిన్ కోటు వేసుకుని స్నానం చేసే రకమని సంచలన వ్యంగ్యాస్త్రాలు విసిరి విమర్శలకు గురైన ప్రధాని నరేంద్ర మోదీ, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత జరిగిన మంచిని ఆయన చూడలేదని ఆరోపిస్తూ, నోట్ల రద్దును వ్యవస్థీకృత, చట్టబద్ధ దోపిడీగా ఆయన పొల్చడం బాధను కలిగించిందని అన్నారు. అందువల్లే కుంభకోణాలు అత్యధికంగా జరిగిన కాంగ్రెస్ పాలన గురించి వివరిస్తూ, మన్మోహన్ చూసీ చూడనట్టు వ్యవహరించారని చెప్పేందుకు అలా మాట్లాడానని, ఆయనపై తనకు గౌరవం ఉందని చెప్పారు. కాగా, నిన్న పార్లమెంట్ లో మోదీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News