: శశికళకు మరో ఎదురుదెబ్బ... రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తెచ్చేందుకు కదిలిన డీజీపీ


శశికళ వర్గం దాచివుంచిన ఎమ్మెల్యేలందరినీ బయటకు తేవాలని ఆపద్ధర్మ సీఎంగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం ఇచ్చిన ఆదేశాలతో తమిళనాడు డీజీపీ కదిలారు. ఎమ్మెల్యేలు ఏఏ స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో ఉన్నారో తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకురావాలని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలు శశికళ వర్గానికి షాక్ ను కలిగించేవేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేల్లో 20 మంది వరకూ మహాబలిపురంలోని ఓ స్టార్ రిసార్టులో ఉన్నారన్న సమాచారం మినహా, మిగతావాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఇంకా రహస్యంగానే ఉంది. వారందరినీ కనుగొని బయటకు తెచ్చేందుకు డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడు రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగినట్లయింది.

  • Loading...

More Telugu News