: రాసలీలల మాజీ మంత్రిపై విచారణ ప్రారంభం!


కర్ణాటకలో అధికార కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి హెచ్.వై.మేటీ రాసలీలలపై విచారణ ప్రారంభమయింది. సీఐడీ డీఎస్పీ రవిశంకర్ నేతృత్వంలోని బృందం బళ్లారిలో విచారణ జరిపింది. మేటీ రాసలీలల సీడీలను విడుదల చేసిన సామాజిక కార్యకర్త రాజశేఖర్ ను రెండు గంటలపాటు నిన్న విచారించారు. అనంతరం మాజీ డీఎస్పీ అనుపమ శెణైను కూడా రెండు గంటల పాటు విచారించారు. బళ్లారి ప్రభుత్వ అతిథిగృహంలో వీరిద్దరిని డీఎస్పీ రవిశంకర్ విచారించారు. ఈ సందర్భంగా వీరి వద్ద నుంచి పలు వివరాలను సేకరించారు.

ఈ సందర్భంగా మరో నలుగురు జర్నలిస్టులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. విచారణ అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ, సమాజం కోసం పోరాడుతున్న వారి కోసం సీఐడీ చేత ప్రభుత్వం విచారణ చేయిస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు. విచారణ జరుపుతున్న సీఐడీ అధికారి రవిశంకర్ రాష్ట్రపతి అవార్డు పొందిన ఉత్తమ అధికారి అని చెప్పారు. మరోవైపు, మేటీ రాసలీలలు వెలుగులోకి వచ్చిన వెంటనే... ఆయనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేటు వేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News