: మాజీ ఎమ్మెల్యే అక్కినేని లోకేశ్వరావు కుమారుడు విజయకృష్ణ అరెస్ట్
తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న సమయంలో దిగిన సన్నిహిత ఫోటోలను ప్రస్తుత భర్తకు చూపిస్తానని, ఓ ఎన్నారై మహిళను వేధిస్తున్న కేసులో మాజీ ఎమ్మెల్యే అక్కినేని లోకేశ్వరరావు కుమారుడు విజయకృష్ణను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తనను నిత్యమూ వేధిస్తున్నాడని విజయవాడ సీపీకి ఎన్నారై మహిళ నుంచి ఫిర్యాదు అందింది. దీన్ని విచారణకు స్వీకరించి, కాల్, మెయిల్ డేటాను పరిశీలించగా, విజయకృష్ణ నిర్వాకం బట్టబయలైంది. 'నా మాటను వినకుంటే, ఇద్దరమూ కలిసున్నప్పటి చిత్రాలను నీ భర్తకు పంపిస్తా' అన్న మెసేజ్ లు దొరికాయి. గత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ మహిళను వేధిస్తున్న విజయకృష్ణను అరెస్ట్ చేశామని, కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.