: హార్వార్డ్ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్
ఈ నెల 11, 12 తేదీల్లో హార్వార్డ్ వర్శిటీలో జరిగే ఇండియన్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఇక ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన ఎన్ఆర్ఐ విభాగం సిద్ధమైందని తెలుస్తోంది. భారీ కార్ ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించింది. పవన్ అభిమానులంతా పార్టీ లోగోలతో కూడిన టీ షర్టులు, బ్యాడ్జీలు ధరించి పవన్ కు స్వాగతం పలుకుతారని సమాచారం. ఇక హార్వార్డ్ వర్శిటీలో విద్యార్థుల ముందు ప్రసంగించడానికి ముందే, యూఎస్ లోని ఇండియన్స్, జనసేన కార్యకర్తలు, తన అభిమానులతో ఆయన మాట్లాడతారని తెలుస్తోంది. యూఎస్ కాంగ్రెస్ సెనెటర్లు, మేయర్ తదితర ప్రముఖులను పవన్ కలుస్తారని జనసేన ప్రతినిధులు తెలిపారు.