: మరో కలకలం.. పదవి వద్దని ఒట్టు పెడుతూ గతంలో శశికళ రాసిన లేఖను బయటకు తెచ్చిన పన్నీర్
2011 డిసెంబర్ లో శశికళను, ఆమె కుటుంబీకులను జయలలిత ఇంట్లోంచి బహిష్కరించిన వేళ, తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తూ, తనకు ఎటువంటి పార్టీ పదవీ వద్దని, తాను భవిష్యత్తులో ఏమీ ఆశించబోనని హామీ ఇస్తూ, శశికళ రాసిన లేఖను ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం బయటపెట్టి కలకలం రేపారు. ఈ లేఖలో శశికళ ప్రస్తావించిన అంశాలను చదివి వినిపించారు. తనను క్షమించాలంటూ శశికళ ఆనాడు అమ్మ దగ్గర ప్రాధేయ పడ్డారని గుర్తు చేశారు. మన్నించరాని తప్పు జరిగి పోయిందని చెబుతూ, ప్రజా జీవితం, పదవులు వద్దని చెప్పిన శశికళ, ఇప్పుడు అమ్మ లేని సమయం చూసుకుని రెచ్చిపోయారని పన్నీర్ ఆరోపించారు.