: మరో అన్నాడీఎంకే నేతను బహిష్కరించిన శశికళ నటరాజన్
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఇటీవలే ఎన్నికయిన శశికళ నటరాజన్.. తనపై తిరుగుబాటు ప్రారంభించిన ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే తనకు
మద్దతుగా నిలవని కొందరు నేతలను తొలగించిన శశికళ.. ఈ రోజు మరో నేతను పార్టీ నుంచి బహిష్కరించారు. పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే, అన్నాడీఎంకే నేత ఓం శక్తి శేఖర్ ను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.