: పన్నీర్ తో భేటీ అయిన సీఎస్ గిరిజ, డీజీపీ రాజేంద్ర
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఈ ఉదయం చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాధన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి నేపథ్యంలో వారు భద్రతాంశాలు, పరిపాలనా పరమైన విషయాలను గురించి చర్చించినట్టు తెలుస్తోంది. గవర్నర్ వచ్చిన తరువాత, ఆయన తీసుకునే నిర్ణయాలపై రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా నిరసనలు బహిర్గతమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సమస్యాత్మకమైన చోట్ల బలగాలను మోహరించాలని పన్నీర్ సెల్వం సూచించినట్టు సమాచారం. వీరి మధ్య జరిగిన భేటీపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.