: సీఎం కాబట్టి పన్నీర్ కే తొలి చాన్స్... రాజ్ భవన్ నుంచి అందిన సంకేతాలు


ఈ మధ్యాహ్నం చెన్నై రాజ్ భవన్ కు చేరుకునే తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, తనను కలిసే మొదటి చాన్స్ పన్నీర్ సెల్వంకు ఇవ్వచ్చని రాజ్ భవన్ వర్గాలు సంకేతాలిచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తొలి అవకాశం ఆయనదేనని, అయితే, అంతకుముందు డీజీపీ, సీఎస్ తదితరులతో గవర్నర్ సమావేశమవుతారని తెలుస్తోంది. గవర్నర్ ను కలిసిన తరువాత, తాను మద్దతు నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరితే, గవర్నర్ అందుకు అంగీకరించి, అసెంబ్లీ ఏర్పాటుకు సూచించాల్సి వుంటుంది. అప్పుడిక శశికళ వర్గం, అసెంబ్లీకి రావాలో, వద్దో నిర్ణయించుకోవాల్సి వుంటుంది. రాకుంటే, డీఎంకే మద్దతుతో పన్నీర్ సీఎంగా నిలుస్తారు. వచ్చి వ్యతిరేకంగా ఓటేస్తే, పన్నీర్ వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నా అదే డీఎంకే మద్దతుతో ప్రభుత్వం నిలుస్తుంది. ఏదిఏమైనా పన్నీర్ గెలిచి నిలవాలంటే, డీఎంకే మద్దతు తప్పనిసరిగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News