: శశికళను తరిమేసేందుకు కదిలిన పన్నీర్... పోయిస్ గార్డెన్ ను మెమోరియల్ గా మారుస్తూ సంతకం!
శశికళకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తనకున్న అధికారంతో అన్నంత పనీ చేస్తున్నారు. జయలలిత నివాసమైన పోయిస్ గార్డెన్ లోని 'వేద నిలయం' భవంతి నుంచి శశికళను తరిమేస్తానని హెచ్చరించిన ఆయన, ఆ దిశగా ఎవరూ ఊహించని అడుగులు వేశారు. ఆ భవనాన్ని జయ మెమోరియల్ గా మారుస్తున్నట్టు ప్రకటించారు. మరికాసేపట్లో ఈ ఆదేశాలపై పన్నీర్ సంతకం పెట్టనున్నారని, ఆ వెంటనే నిర్ణయం అమల్లోకి వచ్చి, శశికళ బయటకు వెళ్లాల్సి వస్తుందని తెలుస్తోంది. ఈ భవనంలో జయలలిత వాడిన వస్తువులు, ఆమెకు వచ్చిన జ్ఞాపికలు తదితరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయిస్తామని పన్నీర్ వెల్లడించారు.