: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ... ఒక వికెట్ ఫట్!
హైదరాబాద్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ను ఎంచుకోగా, ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ను వేసిన తస్కిన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ను తన అద్భుత బంతితో పెవీలియన్ కు పంపాడు. ఆఫ్ స్టంప్ కు ఆవలగా వెళుతున్న బంతిని రాహుల్ ఆడగా, అది ప్యాడ్లను తాకుతూ వికెట్లపైకి వచ్చింది. దీంతో రెండు పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం పుజారా, మురళీ విజయ్ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జట్టు స్కోరు రెండు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి రెండు పరుగులు.