: పిల్లలను రమ్మన్నారు... కనికరం లేకుండా ఎండలో నిలిపారు: స్టేడియం వద్ద అధికారుల నిర్వాకం


నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో, అధికారుల నిర్వాకంతో స్కూలు పిల్లలు ఎండలో మాడుతున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చే స్కూలు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్న ప్రచారాన్ని క్రికెట్ అసోసియేషన్ అధికారులు జోరుగా సాగించడంతో, ఎంతో మంది విద్యార్థులు, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు స్టేడియంకు వచ్చారు. వీరిని లోపలికి పంపేందుకు అధికారులు నిరాకరించారు. వీరితో పాటు ఉపాధ్యాయులు రాలేదని, దరఖాస్తు లేఖలు తేలేదని కుంటిసాకులు చెబుతూ, విద్యార్థులను ఎండలో నిలిపారు. ఈ వ్యవహారం టీవీ చానళ్లలో ప్రసారమవుతోంది. అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల్ని వెంటనే స్టేడియంలోకి పంపాలని మ్యాచ్ చూసేందుకు వచ్చిన పలువురు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News