: మరో బాంబు పేల్చిన పన్నీర్.. పార్టీ డబ్బులపై పూర్తి పెత్తనం తనదేనంటూ బ్యాంకులకు లేఖలు
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం మరోమారు గళమెత్తారు. ఇప్పటికే ఆమెకు కంటిమీద కునుకును దూరం చేసిన సెల్వం తాజాగా పార్టీ డబ్బులపై పూర్తి పెత్తనం తనదేనంటూ బాంబు పేల్చారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తనను తప్పించడం పార్టీ నిబంధనల ప్రకారం అక్రమమని, కాబట్టి తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాలోంచి డబ్బులు తీసుకోవడానికి అనుమతించవద్దని బ్యాంకులకు లేఖలు రాశారు. అన్నాడీఎంకే రాజ్యాంగం ప్రకారం జయలలిత తనను కోశాధికారిగా నియమించారని, తన లిఖిత పూర్వక అనుమతి, సూచనలు లేకుండా పార్టీ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని కరూర్ వైశ్యాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్లను ఆ లేఖల్లో కోరారు.