: పెద్ద నోట్ల రద్దు వివరాలు జూన్ తర్వాతే.. స్పష్టం చేసిన ఆర్బీఐ


రద్దయిన పెద్దనోట్ల లెక్కలు జూన్ 30 తర్వాత మాత్రమే తేలుతాయని ఆర్బీఐ పేర్కొంది. అప్పటి వరకు ఎన్నారైలకు సమయం ఉండడంతో ఆ తర్వాత లెక్కలు పూర్తిస్థాయిలో బయటకు వెల్లడించే వీలుంటుందని తెలిపింది. సహకార బ్యాంకులు, భూటాన్, నేపాల్ నుంచి కూడా నోట్ల సమాచారం అందాల్సి ఉందని ఆర్బీఐ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ఎస్ ముద్రా తెలిపారు. మొత్తం సమాచారం అందాక పూర్తిగా క్రోడీకరించి నోట్ల లెక్కల వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News