: మరో వారంలో చరిత్ర సృష్టించనున్న ‘ఇస్రో’.. నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ37కు లెవల్-2 పరీక్షలు


అత్యద్భుత ప్రయోగం కోసం సిద్ధమై ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ‘ఇస్రో’ మరో వారం రోజుల్లో చరిత్ర సృష్టించనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రాకెట్‌కు తుది పరీక్షల్లో నిమగ్నమైంది. నేడు(గురువారం) రాకెట్‌కు లెవల్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను ఇప్పటికే రాకెట్‌కు అనుసంధానించారు. ఈనెల 15న రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగరనుంది.

మన దేశానికి  చెందిన 639 కిలోల బరువున్న అడ్వాన్స్‌డ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కార్టోశాట్-2డీ, ఒక్కోటి 15 కిలోల బరువున్న ఐఎన్ఎస్-1ఏ, 1బీలతోపాటు అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, కజకిస్థాన్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్ ఈ మొత్తం ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకుపోతుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రాకెట్ కౌంట్ డౌన్ సమయాన్ని కూడా బాగా తగ్గించి 28 గంటలకే కుదించారు.

  • Loading...

More Telugu News