: కొత్త పార్టీ పెట్టను..బలం నిరూపించుకుంటా: పన్నీర్ సెల్వం
'కొత్త పార్టీ పెట్టను..అన్నాడీఎంకేలోనే ఉంటాను' అని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని, ఎమ్మెల్యేలను కూడగట్టుకున్న తర్వాత గవర్నర్ ను కలుస్తానని, కొద్ది రోజుల్లోనే బలం నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. ‘అమ్మ’ జయలలిత మృతిపై తమకూ అనుమానాలు ఉన్నాయని, ఆమె మరణంపై విచారణ కమిషన్ వేయాలన్నది తమ నిర్ణయం అని, బీజేపీ, డీఎంకే సాయంతో పార్టీని చీలుస్తున్నానని శశికళ ఆరోపించడం అన్యాయమని పన్నీర్ సెల్వం అన్నారు.