: రాజ్ భవన్ రాజకీయాలకు వేదిక కాకూడదు: మాజీ గవర్నర్ రోశయ్య
రాజ్ భవన్ రాజకీయాలకు వేదిక కాకూడదని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను శాశ్వతం చేసుకునే క్రమంలో ఈ చిక్కులు అన్నీ వస్తున్నాయి. సమర్ధవంతమైన నాయకుడు లేదా నాయకురాలు గానీ లేనప్పుడు..అందరూ తలా ఒక వైపునకు లాగేందుకు ప్రయత్నం చేస్తారు. పన్నీర్ సెల్వం తనను తాను ఎప్పుడూ కూడా నంబర్ వన్ అని అనుకునే వారు కాదు.. నంబర్ 2 కిందే అనుకునేవారు. అయితే, జయలలిత ఉన్నట్టుగానే మరొకరు ఉండాలంటే సాధ్యమయ్యే మాట కాదు. శశికళ విషయానికి వస్తే .. బయటకు ఎప్పుడూ రాజకీయ వ్యవహారాల జోక్యం కనపడేది కాదు. అంతరంగికంగా ఉండేదేమో! ఉండేదని అంటారు!. ఇప్పుడు తెరపైకి శశికళ నాయకురాలుగా వచ్చే సరికి ఈ చిక్కులన్నీ వచ్చాయి’ అని రోశయ్య అభిప్రాయపడ్డారు.