: టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ‘గంగుల’.. త్వరలో వైసీపీ తీర్థం?
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ ఛార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ యార్డు చైర్మన్ పదవి సహా, పెన్షన్లు, రేషన్ కార్డులు తమ వర్గానికి దక్కలేదని, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గంగుల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ మారడంపై అనుచరులు, ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపారని సమాచారం. ఈ నెల 15న లేదా 18న వైఎస్సార్సీపీలో చేరనున్నారని, భవిష్యత్ కార్యాచరణను ఆయన త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది.